ఆకాశంలో ఓ తార.. సాత్వికకు ఎంతో స్పెషల్!
దుల్కర్ సల్మాన్(Dulquer salman) హీరోగా నటిస్తున్న తాజా సినిమా ఆకాశంలో ఓ తార(aakasam lo oka thaara) ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. పవన్ సాదినేని(pavan sadineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సాత్విక వీరవల్లి(Satvika veeravalli) హీరోయిన్ గా పరిచయం అవుతోంది. సందీప్ గున్నం(Sandeep gunnam), రమ్య గున్నం(Ramya gunnam) నిర్మిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్(Geetha arts), స్వప్న సినిమా(Swapan cinema) సమర్పిస్తున్నాయి. నవంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన సాత్విక తన క్యారెక్టర్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. అంతరిక్షంపై కలలు కనే ఓ పల్లెటూరి అమ్మాయిగా ఇందులో కనిపించనున్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి
తన నిజ జీవిత వ్యక్తిత్వానికి భిన్నంగా ఎంతో అమాయకత్వం, ప్రశాంతత కలిగిన అమ్మాయి పాత్రలో నటించడం కొత్త అనుభూతినిచ్చిందని సాత్విక చెప్పింది. చుట్టూ ఉన్నవారు అవమానించినా, విమర్శించినా వాటిని పట్టించుకోకుండా అంతరిక్షంలోకి వెళ్లాలనే తన లక్ష్యం వైపే అడుగులు వేసే అమ్మాయి ప్రయాణం అందరికీ స్ఫూర్తినిస్తుందని పేర్కొంది. ఈ క్యారెక్టర్ కోసం తన చిన్ననాటి అమాయకత్వాన్ని గుర్తు చేసుకుంటూ నటించానని వెల్లడించింది. ఒక అమ్మాయి సక్సెస్‌కు అండగా నిలిచే అబ్బాయి కథ కూడా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని తెలిపింది.
ఇక షూటింగ్ మొదటి రోజు నుంచే దుల్కర్ సల్మాన్ తనకు ఎంతో ధైర్యాన్నిచ్చారని, ఆయన ఎంకరేజ్మెంట్ తో ఎలాంటి ప్రెజర్ లేకుండా నటించగలిగానని సాత్విక పేర్కొంది. జీవీ ప్రకాశ్ కుమార్(GV PRakash kumar) అందించిన సాంగ్స్, ఆల్రెడీ రిలీజైన గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. శృతి హాసన్(Shruti Haasan), రుహాని శర్మ(Ruhani Sharma) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా థియేటర్లలో ఆడియన్స్ కు ఓ స్పెషల్ అనుభూతిని అందిస్తుందని సాత్విక ధీమా వ్యక్తం చేసింది.







