Allu Arjun: ఆ డైరెక్టర్ తో బన్నీ సినిమా?
టాలీవుడ్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun) వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారాడు. ఇప్పటికే డైరెక్టర్ అట్లీ(Atlee)తో కలిసి తెరకెక్కుతున్న AA22 సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బన్నీ(bunny) పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో, మరో క్రేజీ ప్రాజెక్ట్‌గా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(lokesh kangaraj) తో AA23 అనౌన్స్ చేయడం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచింది.
ఇవి కూడా చదవండి
ఈ నేపథ్యంలో మలయాళ ఇండస్ట్రీకి చెందిన యాక్టర్- డైరెక్టర్ బాసిల్ జోసెఫ్(basil joseph) తో బన్నీ చేయబోయే కొత్త సినిమా గురించి ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం కొనసాగుతుండగా, ఇది ఒక సూపర్ హీరో కాన్సెప్ట్‌తో రూపొందనుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్(geetha arts) నుంచి బాసిల్ అడ్వాన్స్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ కెరీర్లో 25వ సినిమాగా నిలవొచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో ఆయనను పూర్తిగా కొత్త అవతారంలో చూపించే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. ఇదే సమయంలో, ఆయన 24వ సినిమాకు సంబంధించిన వివరాలు కూడా త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వరుసగా భిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న బన్నీ, తన కెరీర్లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టేలా కనిపిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి








