Basil Joseph: తెలుగులో బాసిల్ కు విపరీతమైన ఫాలోయింగ్

కోవిడ్ టైమ్ లో థియేటర్లు మూత పడటంతో ఓటీటీలు బాగా పుంజుకున్నాయి. అప్పటివరకు అందరికీ తెలియని ఓటీటీలు ఒక్కసారిగా పాపులరైపోయాయి. ఆ టైమ్ లో ఆడియన్స్ కూడా భాషను పట్టించుకోకుండా అన్ని భాషల్లోని సినిమాలూ చూశారు. అయితే కోవిడ్ టైమ్ లో ఎక్కువగా ప్రయోజనం పొందిన పరిశ్రమ అంటే అది మలయాళ సినీ పరిశ్రమే.
ఎంతోకాలంలో మలయాళం నుంచి మంచి సినిమాలు వస్తున్నప్పటికీ వాటికి దేశ వ్యాప్తంగా గుర్తింపొచ్చింది మాత్రం ఆ టైమ్ లోనే. ఓటీటీలో మలయాళ సినిమాలకు మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో అక్కడి నటులకు కూడా కొంతమందికి తెలుగులో మంచి ఆదరణ లభించింది. వారిలో ముందు చెప్పుకోవాల్సింది టొవినో థామస్(Tovino Thomas) గురించి. 2018, ఏఆర్ఎం(ARM) సినిమాలకూ థియేటర్లలో కూడా మంచి రెస్పాన్స్ రావడానికి కారణం ఓటీటీ ద్వారా టొవినోకు వచ్చిన క్రేజే.
టొవినో జోరు ఈ మధ్య కాస్త తగ్గగా ఆ స్థానంలోకి ఇప్పుడు బాసిల్ జోసెఫ్(Basil Joseph) వచ్చాడు. జయ జయ జయహే(Jaya Jaya Jayahe) సినిమాతో నెక్ట్స్ లెవెల్ క్రేజ్ ను సొంతం చేసుకున్న బాసిల్ ఆ తర్వాత నూనాక్కుళి(Noonakkuli), సూక్ష్మదర్శిని(Sookshmadarshini) తో పాటూ పలు సినిమాలతో ఆకట్టుకున్నాడు. పొన్ మ్యాన్(Pon Man) బాసిల్ ఫాలోయింగ్ ను తెలుగులో ఇంకాస్త పెంచింది. రీసెంట్ గా మరణమాస్(Marana mass) తో ప్రేక్షకుల ముందుకొచ్చి మరోసారి అందరినీ ఆకట్టుకున్న బాసిల్ చేస్తున్న సినిమాలు తెలుగు ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేస్తున్నాయి. అతన్నుంచి ఏదైన సినిమా వస్తుందంటే అందులో సంథింగ్ ఉంటుందనే నమ్మకాన్ని బాసిల్ తెలుగు ఆడియన్స్ కు ఆల్రెడీ ఇచ్చేశాడు. అందుకే తెలుగులో అతనికి మంచి పాపులారిటీ వచ్చింది. అయితే బాసిల్ కేవలం నటుడు మాత్రమే కాదు, డైరెక్టర్ కూడా. ఆల్రెడీ బాసిల్ దర్శకత్వంలో మూడు సినిమాలు కూడా వచ్చాయి.