టిక్ టాక్ లో వీడియో పోస్ట్ చేసిన బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టిక్‌టాక్‌ను వినియోగిస్తుండటం తాజాగా చర్చనీయాంశమైంది. ఈ యాప్‌తో జాతీయ భద్రతకు ముప్పుందని ఆయన ప్రభుత్వం గతంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఫెడరల్ ప్రభుత్వ సాధనాల్లో దాని వినియోగాన్ని నిషేధించింది కూడా. అయితే ప్రస్తుతం బైడెన్ స్వయంగా టిక్‌టాక్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై ఆయన బృందం వివరణ ఇస్తూ టిక్‌టాక్‌ను వినియోగించాలని బైడెన్ వ్యక్తిగతంగా అనుకోలేదు. కానీ అమెరికా యువ ఓటర్లు మిగిలిన సంప్రదాయ సామాజిక మాధ్యమ వేదికలకు దూరంగా ఉండటంతో వారిని చేరుకోవడానికి తాత్కాలికంగా ఈ యాప్‌ను ఉపయోగించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు అని పేర్కొంది.






