Donald Trump: ఎన్నికల వ్యవస్థను మార్చకపోతే.. దేశమే ఉండదు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఎన్నికల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఎన్నికలు రిగ్గింగ్ జరుగుతున్నాయని, వాటిని దొంగిలిస్తున్నారని (Rigged and Stolen) ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల వ్యవస్థలో సమూల మార్పులు చేయకపోతే, అమెరికా ఒక దేశంగా మిగలదని ఆయన హెచ్చరించారు. ఫిబ్రవరి 9న తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’ (Truth Social) వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడానికి ఆయన (Donald Trump) మూడు ప్రధాన డిమాండ్లను తెరపైకి తెచ్చారు. వీటిని ‘సేవ్ అమెరికా యాక్ట్’ (Save America Act)లో భాగంగా అమలు చేయాలని కోరారు. ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ఐడీని (Government-issued Photo ID) చూపించాలి. ఓటరుగా నమోదు చేసుకునే సమయంలోనే అమెరికా పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలి. అనారోగ్యం, మిలిటరీ సర్వీస్ వంటి అత్యవసర పరిస్థితుల్లో తప్ప, మిగతా సమయాల్లో మెయిల్-ఇన్ బ్యాలెట్ విధానాన్ని రద్దు చేయాలి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ట్రంప్ (Donald Trump) వ్యాఖ్యలపై డెమోక్రటిక్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకోవడానికే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని హౌస్ మైనారిటీ లీడర్ హకీమ్ జెఫ్రీస్ (Hakeem Jeffries) విమర్శించారు. ఎన్నికల నిర్వహణను జాతీయీకరణ (Nationalise) చేసి, వ్యవస్థను దొంగిలించాలని ట్రంప్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. 2020 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుండి ట్రంప్ ఈ ఆరోపణలు చేస్తున్నారని, అయితే కోర్టుల్లో కానీ, ఎన్నికల డేటాలో కానీ రిగ్గింగ్ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని నిపుణులు గుర్తుచేస్తున్నారు.













