అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో బైడెన్ కు తొలి విజయం
డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలి గెలుపు నమోదు చేశారు. దక్షిణ కరోలినా ప్రైమరీలో ఏకంగా 96.2 శాతం ఓట్లు సాధించి, ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. రెండో స్థానంలో మెరియన్ విలియమ్సన్కు రాష్ట్రంలో కేవలం 2.1 శాతం ఓట్లు లభించాయి. విజయానంతరం బైడెన్ మాట్లాడుతూ 2020లో అంచనాలను తలకిందులు చేస్తూ దక్షిణ కరోలినా ఓటర్లు తన విజయానికి బాటలు వేశారని అన్నారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లోనూ తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌నకు తన చేతిలో మరోసారి ఓటమి తప్పదని పేర్కొన్నారు.






