ట్రంప్ వైఖరి.. అమెరికన్లకు ప్రాణాంతకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార మార్పిడికి సహకరించకపోతే మరింత మంది అమెరికన్లు కరోనా వైరస్‌తో మరణించే ముప్పు ఉందని కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. బైడెన్ మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు. కరోనా వైరస్ ప్రబలిన తర్వాత ఎన్నడూ లేనివిధంగా ఇటీవల ఒక్క రోజేలోనే అమెరికాలో లక్షా 60వేల కేసులు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ను ఎలా అభివృద్ధి చేయాలి? దాన్ని 30 కోట్ల మంది అమెరికన్లకు ఎలా పంపిణీ చేయాలి. అనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో ట్రంప్ సహకరించకుండా కొత్త ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టిస్తే మరింత మంది అమెరికన్లు మృత్యువు బారినపడతారు అని హెచ్చరించారు.






