వ్యతిరేక పరిస్థితులపై ట్రంప్ అసహనం…ఏమి చేయాలి?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు దక్కుతుందా లేదా అన్న డోలాయమాన పరిస్థితుల్లో ఉన్న ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నీ చోట్లా బైడెన్‌కు లభిస్తున్న మెజారిటీని చూసి అసహనం వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దానికితోడు ఓటమి ఎదురైతే అంగీకరించడమా లేక కోర్టుకు వెళ్ళడమా అన్న విషయమై నిర్ణయాన్ని తేల్చుకోలేకపోతున్నారు. తన సహాయకులు, సలహాదార్లు, పార్టీ నేతలతో సమావేశమై ఆయన అన్ని అంశాలనూ చర్చించారు. ఓటమిని ఒప్పేసుకోవడం మంచిదని, హుందాగా ఉంటుందని కొందరు సూచించగా- మిగిలిన వారు కోర్టుల్లో గట్టిగా పోరాడదామని అభిప్రాయపడ్డారు.
మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. మేం కోరుతున్నది నిజాయితీ అయిన పోలింగ్, నిజాయితీ ఉన్న సిబ్బందితో నిజాయితీగా ఓట్ల లెక్కింపు. అప్పుడే అమెరికా గెలుస్తుంది. ప్రజాభిప్రాయానికి పట్టం కట్టినట్లవుతుంది. ఇది జరగలేదు. పోలింగ్ జరిగాక వచ్చిన ఓట్లను అనుమతించడమేంటి? ఇది చట్టవిరుద్దమన్నారు. దానికితోడు మీడియా అంతా వారి కి అనుకూలంగా మారింది. సాంకేతిక సంస్థలూ వారికే మద్దతు(బిగ్ మనీ- బిగ్ మీడియా- బిగ్ టెక్). ఈ పరిస్థితుల్లో నిజాయితీకి, చిత్తశుద్ధికి స్థానమెక్కడ? మేం ఇప్పటికే అరిజోనా, విస్కాన్సన్ల్లో గెలిచేశాం. అయినా బైడెన్ లీడ్‌లో ఉన్నట్లు చూపుతున్నారు అంటూ దాడికి దిగారు.






