జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు… అది ఏమాత్రం మంచిది కాదు
జనాభా, ఆర్థిక సమస్యలు చైనాను పేలడానికి సిద్ధంగా ఉన్న టైమ్ బాంబులా మార్చేశాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యాటాలోని పార్క్సిటీలో విరాళా సేకరణ కార్యక్రమంలో సందర్భంగా బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ పరిస్థితి మిగిలిన ప్రపంచాన్ని భయపెడుతోందన్నారు. చైనాలో వృద్ధి మందగించిందని, దీనికి తోడు అక్కడ పనిచేసేవారి కంటే రిటైరైపోయేవారి సంఖ్యే అధికంగా ఉండటం సమస్యాత్మకంగా మారిందని అన్నారు. అత్యధిక నిరుద్యోగ రేటు కొనసాగుతోంది. దీంతో వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది ఏమాత్రం మంచిది కాదు. సాధారణంగా చెడ్డవారికి సమస్యలుంటే, వారు మరింత చెడు పనులే చేస్తారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.






