త్వరలో హవాయికి వెళ్తా : బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చే వారం హవాయిలోని కార్చిచ్చు కబళించిన ప్రదేశాలకు వెళ్లనున్నారని శ్వేతసౌధం ప్రకటించింది. శతాబ్దాల చరిత్ర కలిగిన అమెరికా లోని హవాయి దీవుల్లో స్వర్గధామంగా పిలిచే లహైనా రిసార్టు నగరం కార్చిచ్చు కారణంగా బూడిద గుట్టగా మారిపోయింది. ఈ ప్రకృతి విపత్తు ఇప్పటి వరకు 100 మందికి పైగా బలి తీసుకుంది. ఈ విపత్తుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. త్వరలోనే తన భార్య జిల్ బైడెన్ తో కలిసి అక్కడికి వెళతానన్నారు. ఆయన ఈ పర్యటనలో బాధితులు, సహాయ సిబ్బందిని కలవనున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.






