Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తి మిస్టరీ ఇక ‘హిస్టరీ’యే.. ఫైర్ అయిన శ్రీకాంత్!
టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తికి (Varun Chakravarthy) కాలం ఏమాత్రం కలిసిరావడం లేదు. ఒకప్పుడు తన బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన ఈ స్పిన్నర్.. ఇప్పుడు దారుణంగా తేలిపోతున్నాడు. గత టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసి, ఆ తర్వాత క్రమంగా లయ తప్పిన వరుణ్.. అదే పేలవమైన ఫామ్‌ను ప్రస్తుత ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్లోనూ కొనసాగిస్తున్నాడు.
ముంబై ఇండియన్స్‌తో (Mumbai Indians) జరిగిన తొలి మ్యాచ్‌లో వరుణ్ (Varun Chakravarthy) దారుణంగా విఫలమయ్యాడు. తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 48 పరుగులు సమర్పించుకుని కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఈ పేలవ ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్, చీఫ్ సెలెక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరుణ్ బౌలింగ్ శైలిని ప్రత్యర్థి బ్యాటర్లు సులభంగా పసిగట్టేశారని, అతనిలోని ‘మిస్టరీ’ ఇక ‘హిస్టరీ’ (గతం)గా మారిపోయిందని శ్రీకాంత్ కుండబద్దలు కొట్టాడు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
వైవిధ్యం లేకపోతే కష్టమే
వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) బౌలింగ్‌లో వైవిధ్యం (Variations) లోపించిందని శ్రీకాంత్ విశ్లేషించాడు. “బంతిని విభిన్నంగా వేయడం, ముఖ్యంగా ‘లెగ్ స్పిన్’ (Leg Spin) సంధించడం నేర్చుకోనంత కాలం వరుణ్ ఇలాగే ఇబ్బంది పడుతూనే ఉంటాడు. ఎప్పుడూ ఒకే తరహా గూగ్లీలు (Googlies) వేస్తే బ్యాటర్లు ఇట్టే పసిగట్టేస్తారు. బౌలింగ్‌లో వేరియేషన్స్ చూపిస్తూ, అప్పుడప్పుడు పక్కా లెగ్ స్పిన్ బంతులు వేయాలి. ఇప్పుడైతే అతని బౌలింగ్‌లో ఎలాంటి మిస్టరీ లేదు, అదంతా హిస్టరీయే!” అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. బ్యాటర్లను బోల్తా కొట్టించాలంటే బంతిని వారికి కాస్త దూరంగా (Wide of the crease) విసరాలని, అప్పుడు భారీ షాట్లకు యత్నించి వికెట్లు సమర్పించుకునే అవకాశం ఉంటుందని సూచించాడు.
కెప్టెన్లకు శ్రీకాంత్ సూచన
ఈ సందర్భంగా ఫ్రాంచైజీ కెప్టెన్లకు కూడా శ్రీకాంత్ ఒక కీలక సూచన చేశాడు. వరుణ్ చక్రవర్తిని (Varun Chakravarthy) ప్రస్తుత ఫామ్ దృష్ట్యా పవర్ ప్లేలో (Powerplay) బౌలింగ్‌కు దించవద్దని సలహా ఇచ్చాడు. “ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) వరుణ్ వేసిన తొలి ఓవర్లోనే విరుచుకుపడి భారీగా పరుగులు రాబట్టాడు. పవర్ ప్లేలో అలా పరుగులు ఇచ్చుకోవడంతో వరుణ్ ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది. ఆ తర్వాత అతను తేరుకోలేకపోయాడు” అని శ్రీకాంత్ వివరించాడు.
ఇవి కూడా చదవండి








