Team India Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. 2026-27 స్వదేశీ షెడ్యూల్ విడుదల!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2026-27 సీజన్‌కు సంబంధించిన స్వదేశీ (Home Season) షెడ్యూల్‌ను (Team India Schedule) అధికారికంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ సుదీర్ఘ సీజన్లో భారత్ సొంతగడ్డపై ఏకంగా నాలుగు దేశాలతో తలపడనుంది. వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత పర్యటనకు రానున్నాయి. 2026 సెప్టెంబర్ 27న ప్రారంభమయ్యే ఈ క్రికెట్ మహా సంగ్రామం.. 2027 మార్చి 3 వరకు ఏకధాటిగా (Team India Schedule) కొనసాగనుంది. దేశవ్యాప్తంగా మొత్తం 17 నగరాలు ఈ 22 అంతర్జాతీయ మ్యాచ్‌లకు (టెస్టులు, వన్డేలు, టీ20లు) ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి.
ప్రపంచకప్‌పై గురి.. 9 వన్డేల వ్యూహం
వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ షెడ్యూల్‌ను (Team India Schedule) అత్యంత వ్యూహాత్మకంగా రూపొందించింది. ఈ సీజన్లో టీమిండియా ఏకంగా 9 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. వన్డేలకే పరిమితమై, ప్రపంచకప్ లక్ష్యంగా సాగుతున్న దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఆటను ఈ తొమ్మిది మ్యాచుల్లో చూసి ఆస్వాదించే అద్భుత అవకాశం అభిమానులకు దక్కనుంది. మరోవైపు కుర్రాళ్లతో కూడిన టీ20 జట్టు విండీస్, లంకలతో పొట్టి ఫార్మాట్లో సత్తా చాటనుంది.
హైదరాబాద్‌కు డబుల్ ధమాకా
క్రికెట్ ఫీవర్‌తో ఎప్పుడూ ముందుండే భాగ్యనగర అభిమానులకు ఈ షెడ్యూల్ (Team India Schedule) డబుల్ ధమాకా అందించింది. ఉప్పల్ స్టేడియం వేదికగా రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 14న వెస్టిండీస్‌తో ఉత్కంఠభరితమైన నాలుగో టీ20కి, అలాగే 2027 జనవరి 6న జింబాబ్వేతో జరగనున్న రెండో వన్డేకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇవి కూడా చదవండి
‘బోర్డర్ – గావస్కర్’ ట్రోఫీ
ఈ హోం సీజన్లో (Team India Schedule) అందరి కళ్లూ ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ’పైనే ఉన్నాయి. ఐదు టెస్టుల ఈ సుదీర్ఘ సిరీస్ కోసం ఆసీస్ 2027 జనవరిలో భారత్‌లో అడుగుపెట్టనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ రేసులో ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది.
తొలి టెస్టు: జనవరి 21 – 25 (నాగ్‌పుర్)
రెండో టెస్టు: జనవరి 29 – ఫిబ్రవరి 2 (చెన్నై)
మూడో టెస్టు: ఫిబ్రవరి 11 – 15 (గువాహటి)
నాలుగో టెస్టు: ఫిబ్రవరి 19 – 27 (రాంచీ)
ఐదో టెస్టు: ఫిబ్రవరి 27 – మార్చి 3 (అహ్మదాబాద్)
సిరీస్‌ల వివరాలు
వెస్టిండీస్‌తో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు 3 వన్డేలు, 5 టీ20లు జరగనున్నాయి. శ్రీలంకతో డిసెంబర్ 13 నుంచి 27 వరకు 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ (Team India Schedule) ఉంటుంది. జింబాబ్వేతో జనవరి 3, 6, 9 తేదీల్లో వరుసగా కోల్‌కతా, హైదరాబాద్, ముంబయి నగరాల్లో మూడు వన్డేలు జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం డే/నైట్ మ్యాచ్‌లైన టీ20లు రాత్రి 7 గంటలకు, వన్డేలు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. టెస్ట్ మ్యాచ్‌లు ఉదయం 9.30 గంటలకు మొదలవుతాయి.
ఇవి కూడా చదవండి








