Ambati Rayudu: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీపై రాయుడు సంచలన వ్యాఖ్యలు..!
భారత మాజీ బ్యాటర్ అంబటి రాయుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. తన ముక్కుసూటి తనంతో ఎప్పుడూ వార్తల్లో ఉండే రాయుడు, తాజాగా భారత టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని(Virat Kohli) మళ్లీ టెస్ట్ కెప్టెన్‌గా నియమించాలని, ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్థానంలో అతడే సరైన నాయకుడని రాయుడు పేర్కొనడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఐపీఎల్ 2026(IPL 2026) సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై(SRH) విరాట్ కోహ్లీ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ రాయుడిని విశేషంగా ఆకట్టుకుందట.
ఇవి కూడా చదవండి
ఆ మ్యాచ్‌లో కోహ్లీ ఒంటిచేత్తో ఆర్సిబిని(RCB) గెలిపించిన తీరు చూసిన తర్వాత, రాయుడు ఒక స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. కోహ్లీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని, ముఖ్యంగా సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టుల్లో భారత్‌ను నడిపించే సత్తా అతనికి మాత్రమే ఉందని ప్రశంసించాడు. ప్రస్తుతం భారత టెస్ట్ జట్టుకు శుభ్‌మన్ గిల్(Gill) నాయకత్వం వహిస్తున్నప్పటికీ, కోహ్లీ ఉన్నంత అగ్రెసివ్‌గా జట్టును నడిపించలేకపోతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.
దీనిపై స్పందించిన రాయుడు, టెస్ట్ క్రికెట్లో కోహ్లీ ఒక లెజెండ్ అని, జట్టును గెలిపించాలనే కసి అతనిలో పుష్కలంగా ఉంటుందన్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, భారత క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా కోహ్లీ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని రాయుడు విజ్ఞప్తి చేశారు. టెస్ట్ ఫార్మాట్లో భారత్ మళ్ళీ అగ్రస్థానానికి చేరుకోవాలంటే కోహ్లీ నాయకత్వం అత్యవసరమని ఆయన నొక్కి చెప్పారు. రాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బీసీసీఐ పెద్దల దృష్టికి కూడా వెళ్లడంతో, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి








