10వేల మంది చూస్తేనే డబ్బులు : యూట్యూబ్
ఇకపై యూట్యూబ్ చానల్ ద్వారా డబ్బులు సంపాదించుకోవడం అంత సులభం కాదు. ఇకపై యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోను కనీసం 10 వేల మంది చూస్తేనే దానిపై డబ్బులు వస్తాయని యూట్యూబ్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వైస్‌ప్రెసిడెంట్ ఎరియల్ బర్డిన్ తెలిపారు. అంటే 10 వేల మంది వీక్షకులు దాటేంత వరకు యూట్యూబ్ ఆ వీడియోకు ప్రకటనలు (యాడ్స్) ఇవ్వదు. ఈ యాడ్లు వచ్చిన తర్వాత వీక్షకుల క్లిక్‌లను (సీసీవీ) బట్టే చానల్ నిర్వహకుడికి యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది. ఈ కనీసం పరిమితి విధించడం ద్వారా నకిలీలు, పైరసీలను ఆరికట్టవచ్చని, తాము విధించిన పరిమితికి చేరిన తర్వాత ఆ చానల్ తమ విధానాలను అనుసరిస్తుందా లేదా పరిశీలించి యాడ్లు ఇస్తామని ఎరియల్ ఓ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.






