ఐరాసలో హిందీ అధికార భాష కావాలి : యార్లగడ
ఐక్య రాజ్య సమితిలో హిందీని అధికార భాషగా ప్రకటించేలా కృషి చేయాలని ప్రధానికి కేంద్రీయ హిందీ సంఘం సభ్యుడు యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటన సందర్భంగా వివిధ వేదికలపై ప్రధాని హిందీలో ప్రసంగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. షికాగోలో ఈ నెల 30 నుంచి జులై 2 వరకు ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో 5వ అమెరికా తెలుగు సంబరాలు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.








