వెంకయ్యను కలిసిన యార్లగడ్డ
తెలంగాణ ప్రభుత్వం డా. సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారె)పై ప్రచురించిన ప్రసిద్ధ రచయితల వ్యాసాల సంకలనం గ్రంథాన్ని ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడికి డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అందజేశారు. గురువారం వెంకయ్య నాయుడిని యార్లగడ్డ కలిశారు. ఈ గ్రంధంలోని మొదటి వ్యాసం వెంకయ్యనాయుడిదే కావడం విశేషం.








