రూ.1కే స్మార్ట్ ఫోన్
వివిధ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న చైనాకు చెందిన షియోమి మొబైల్ సంస్థ మరో మారు తమ సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకు రానుంది. భారత్‌తో షియోమి మొబైల్స్‌ని ప్రవేశ పెట్టి మూడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 20, 21 తేదీల్లో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. రెడ్మి 4ఏ, వైఫై రిపీటర్2, 10,000ఎంఏహెచ్ తదితర ఉత్పత్తులను ఒక్కోటి కేవలం రూ.1కే అందించేలా ఫ్లాష్ సేల్‌ను ప్రకటించింది. ఈ ప్లాష్ సేల్ వర్తించాలంటే వినియోగదారులు ఈ పేజీని సామాజిక మాద్యమాల్లో షేర్ చేయాల్సి ఉంటుంది. నిల్వలు అందుబాటులో ఉన్నంత వరకు మాత్రమే ప్రత్యేక ఆఫర్లు వర్తిస్తాయని షియోమి సంస్థ పేర్కొంది.
ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు అదనంగా 5శాతం క్యాష్ బ్యాక్‌ను, రూ.8000 కంటే ఎక్కువ కొనుగోలు చేసిన వినియోగదారులకు ఒక్కో కార్డుకు రూ.500 వరకు క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది.
అంతే కాకుండా ఎంఐ మ్యాక్స్2 మొబైల్స్‌ని షియోమి సంస్థ భారత విపణిలోకి మంగళవారం ప్రవేశపెట్టింది. నూతనంగా మార్కెట్లోకి విడుదలైన ఈ మొబైల్స్ కూడా జూలై 20 మధ్యాహ్నం 12 గంటల నుంచి నిల్వలు అయిపోయేంత వరకు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు రోజులపాటు ఎంఐ మ్యాక్స్2 తోపాటు రెడ్మి4, రెడ్మి నోట్4, రెడ్మి 4ఏ స్మార్ట్ ఫోన్లు కూడా అందుబాటులో ఉంటాయి.








