కారులో 78 రోజుల వాణిజ్య పర్యటన
భారతీయ కార్యనిర్వాహక సలహాదారుడిగా పనిచేస్తున్న జగత్షా అమెరికా, భారత్‌ల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించడానికి 78 రోజుల పర్యటనకు ముంబయిలోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద శ్రీకారం చుట్టారు. అగ్రరాజ్యంలోని 24 రాష్ట్రాల మీదుగా 32 నగరాల్లో గల వ్యాపారులు, విశ్వవిద్యాలయాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కలుస్తారు. కారు నడుపుతూ పర్యటన మొత్తం చేస్తానని ఆయన చెబుతున్నారు.








