గ్రేట్ మాన్ సూన్ సేల్ ప్రకటించిన విస్తారా
ప్రైవేటు రంగ విమానయాన సంస్థ విస్తారా మాన్సూన్ సేల్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. రిటర్న్ ఆఫ్ ది గ్రేట్ మాన్సూన్ సేల్ ఆఫర్ పేరుతో రూ.799 ప్రారంభ ధరతో టికెట్లను విక్రయిస్తున్నట్లు తెలిపింది. నేటి నుంచి ప్రారంభమైన టికెట్ల విక్రయం రేపటి (7వ తేదీ) వరకు ఉంటుందని తెలిపింది. ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన టికెట్లతో జూలై 21 నుంచి సెప్టెంబరు 20 మధ్య ప్రయాణించవచ్చని పేర్కొంది. మొదటి వచ్చిన వారికి మొదట విధానంపై టికెట్లను విక్రయించనున్నట్లు విస్తారా వివరించింది. ఈ ఆఫర్ కింద అన్ని చార్జీలు కలుపుకొని ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు రూ.799 కే టికెట్లను విక్రయించనుంది. జూలై 1 నుంచి అమల్లోకి విచ్చన జీఎస్టీ కారణంగా ఎకానమీ క్లాస్ టికెట్లు చవక అయ్యాయి. ఎకానమీ క్లాస్ ప్రయాణాన్ని జీఎస్టీలో 5శాతం పన్ను పరిధిలోకి తెచ్చారు.








