మిడ్ సమ్మర్ సేల్ ఆఫర్ ప్రకటించిన విస్తారా
ప్రముఖ ఎయిర్‌లెన్స్ విస్తారా కూడా తగ్గింపు ధరలను ప్రకటించింది. మిడ్ సమ్మర్ సేల్ పేరుతో డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన మార్గాలలో అతి తక్కువ ధరను రూ.999లుగా నిర్ణయించింది. ఈ ఆఫర్లో బుకింగ్స్ మే 17 నుంచి ప్రారంభమై మే 20న ముగియనున్నాయి. బుక్ చేసుక్ను టికెట్ల ద్వారా 2017, జూన్ 12 నుంచి ఫిబ్రవరి 20, 2018 మధ్య ప్రయాణించేందుకు అవకాశం. జమ్మూ -శ్రీనగర్, గువహతి- బాగ్డోగ్ర మార్గాల్లో విమాన టికెట్‌ను రూ.999 లకే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ-చండీగఢ్ రూ.1499, ఢిల్లీ-లక్నో రూ.1,549, ఢిల్లీ -అమృతసర్ రూ.1699 లుగా వెల్లడించింది. అయితే ఆఫర్ కింద కేటాయించిన సీట్ల సంఖ్యను మాత్రం బహిర్గతం చేయలేదు. ఈ ధరలో ఎకానమిక్ క్లాస్‌లో మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది. అలాగే ప్రీమియం ఎకానమీలో రూ.2,000 ఆఫర్‌ను వాడుకోవచ్చని తెలిపింది. అలా ఏఈ రాయితీ ఛార్జీలు తిరిగి చెల్లించబడవని, గ్రూప్, ఇన్ఫాంటు బుకింగ్‌లకు వర్తించవని ఎయిర్‌లైన్స్ తన వెబ్సైట్లో పేర్కొంది.








