రూ.799కే విమానయానం
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా ఫ్రీడం సేల్ పేరుతో భారీ డిస్కౌంట్లతో రెండు రోజుల అమ్మకాలను ప్రకటించింది. ఎంపిక చేసిన ప్రాంతాలకు ప్రారంభ ధర రూ.799 నుంచి విమానయానం అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొరింది. కాగా ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని పేర్కొంది. అయితే ఇది ఒక వైపు వెళ్లడానికి (వన్ వే) మాత్రం వర్తిస్తుందని షరతు విధించింది. ఆగస్టు 8-9 తేదీల్లో ఈ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. కాగా ఆగస్టు 23 నుంచి ఏప్రిల్ 19 మధ్య కాలంలో ప్రయాణించేందుకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎకానమీ క్లాస్ టికెట్ కేవలం రూ.799లకు, ప్రీమియం ఎకానమీ టికెట్లను రూ.2,099 ధరల్లో అందిస్తోంది. ఈ పథకంలో భాగంగా గోవా, పోర్ట్ బ్లెయిర్, లడఖ్, జమ్మూ, శ్రీనగర్, కొచ్చి, గౌవతి, అమత్సర్, భువనేశ్వర్, ఢిల్లీ, కోల్కతా, ముంబాయి, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల మధ్య ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు ఈ కంపెనీ పేర్కొంది. ముందు బుక్ చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యత అధారంగా టికెట్లను కేటాయిస్తామని సృష్టం చేసింది.








