అన్నాడీఎంకేలోకి రాములమ్మ ?
సినీతార, ప్రస్తుత కాంగ్రెస్ నేత విజయశాంతి(రాములమ్మ) అన్నాడీఎంకేలో చేరబోతున్నారా? అవుననే అంటున్నారు ఆ పార్టీ లోని శశికళ వర్గానికి చెందిన నాయకులు. దీనికి బలం చేకూర్చేలా జైలుకు వెళ్లి మరి శశికళను కలిసి వచ్చిన విజయశాంతి చెన్నైలోని అన్నాడీఎంకే డిప్యూటీ నేత టీటీవీ దినకరన్‌తో సమావేశం అయ్యారు. తనకు మద్దతు పలికేందుకు వచ్చిన ఎమ్మేల్యేలను పక్కనబెట్టి మరీ విజయశాంతికి దినకరన్ స్వాగతం పలికారు. భేటీ అనంతరం పార్టీ వ్యవహారాలను దినకరన్ చక్కదిద్దగలరన్న నమ్మకం తనకుందని ఎమ్మెల్యేలతో విజయశాంతి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మరోవైపీ టీటీవీ దినకరన్‌కు ఎమ్మెల్యేల మద్దతు రోజు రోజుకూ పెరుగుతోంది. దినకరన్‌ను కలిసేందుకు ఆ పార్టీ నేతలు బారులు తీరుతున్నారు.













