డిప్రెషన్ కు వీడియోగేమ్ తో చికిత్స?
వీడియో గేమ్ ఆడడం ద్వారా డిప్రెషన్ నుంచి బయటపడవచ్చా అంటే శాస్త్రవేత్తలు అవుననే జవాబిస్తున్నారు. అయితే, ఇందుకోసం ప్రత్యేకంగా అభివృద్ధిచేసిన వీడియో గేమ్తోనే ప్రయోజనం ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకుల బృందం ఈ వినూత్న వీడియోగేమ్ను రూపొందించింది. ఈ బృందంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తకూడా ఉండడం విశేషం. ఈ మేరకు 106 మంది యువతీయువకులపై ఈ గేమ్ ప్రభావాన్ని పరిశీలించగా, డిప్రెషన్ నుంచి బయటపడడానికి తోడ్పడుతుందని తేలింది. వీడియో గేమ్ రూపంలో ఉన్నప్పటికీ నిజానికి ఇది బ్రెయిన్ ట్రైనింగ్ యాప్ అని శాస్త్రవేత్తల బృందం వివరించింది. దీని సాయంతో మొదడులో కలుగుతున్న సంచలనాలను నియంత్రించి, నిరాశ నిస్పృహలను తరిమేయవచ్చని పేర్కొంది.













