కేంద్రమంత్రి పదవికి వెంకయ్య రాజీనామా
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన ఎం.వెంకయ్యనాయుడు కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన సారథ్యం వహిస్తున్న పట్టణాభివృద్ధి శాఖను నరేంద్ర సింగ్ తోమర్‌కు, సమాచార, ప్రసార శాఖ బాధ్యతలను స్మృతి ఇరానీకి అప్పగించారు. నిన్న జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యను ఏకగ్రీవంగా ఎనుకున్న సంగతి తెలిసింది. దీంతో ఈ రోజు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.








