ట్విట్టర్లోకి ఉపరాష్ట్రపతి
తనకు సంబంధించిన ఆప్డేట్స్ కోసం ఇకపై వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ పేజీని చూడండని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ ట్విట్టర్ పేజీలో ఉప రాష్ట్రపతి ప్రతిరోజూ హాజరవుతున్న కార్యక్రమాల వివరాలు, ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వారితో వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారని అందులో పేర్కొన్నారు. మరోవైపు వెంకయ్య నాయుడి వ్యక్తిగత ఖాతా కూడా కొనసాగుతోంది.








