విషపు నురగలతో మహానగరం ఉక్కిరిబిక్కిరి
బెంగళూరు మహానగరం విషపు నురగలతో ఉక్కిరిబిక్కిరి అయింది. నగరంలోని రెండు పెద్ద సరస్సులు బెల్లందూరు, వర్తూర్‌లు పెద్దఎత్తున విషపూరిత నురగలను వెదజల్లాయి. ఒక్కసారిగా రోడ్లమీదకు నురగలు రావటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వైట్‌ఫీల్డ్ రోడ్డులోని వార్తూర్ సరస్సు నుంచి నురగలు మబ్బుల్లా రోడ్డు మీదకు వచ్చేశాయి. దీంతో ట్రాఫిక్ చాలాసేపు జామ్ అయ్యియి. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ దీనివల్ల పెద్ద సమస్య లేదని, త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన అన్నారు.








