బిజెపిపై అమెరికా నిఘా
వికీలీక్స్ మరోసారి వార్తల్లోకెక్కింది. వివిధ దేశాల్లోని రాజకీయ పార్టీలపై నిఘా పెట్టాలని అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ)కు అమెరికా ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. ఎన్ఎస్ఏ జాబితాల్లో ఉన్న పార్టీలో భారత్ నుంచి అధికార బిజెపి, పాక్‌లోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఉన్నట్లు వికిలీక్స్ తెలిపింది. అమెరికా ఎన్ఎస్ఏ పాకిస్థాన్ మొబైల్ నెట్వర్కింగ్ సిస్టమ్స్‌లోకి కూడా ప్రవేశించిందని పేర్కొంది. వందలాది ఎన్ఎస్ఏ సైబర్ ఆయుధాలను బహిరంగంగా విడుదల చేసినట్లు వికీలీక్స్ తెలిపింది. వీటిలో పాకిస్థాన్ మొబైల్ సిస్టమ్ హ్యాకింగ్ కోడ్ కూడా ఉన్నట్లు పేర్కొంది.













