ప్రధాని మోడీతో అమెరికా కాంగ్రెస్ బృందం భేటీ
అమెరికా కాంగ్రెస్కు చెందిన ఎనిమిది మంది ప్రతినిధుల బృందం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైంది. భద్రతా సహకారం, ఉగ్రవాద ముప్పు, ఇతర అంశాలపై ఈ భేటీలో చర్చ సాగింది. అమెరికా బృందానికి ప్రతినిధుల సభలో డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు నాన్సీ పెలోసీ నేతృత్వం వహిస్తున్నారు. వాతావరణ మార్పులపై పోరాటానికి భారత్ నాయకత్వం వహించడం, రెండు దేశాల్లో మానవ హక్కులను పరిరక్షించడంపై ప్రధానితో చర్చించినట్టు నాన్సీ పెలోసీ తెలిపారు.








