మానవ శరీరం గురించిన నమ్మలేని నిజాలివి! మీకు తెలుసా?
మానవ శరీరం ఎంతో అద్భుత నిర్మాణం. పుట్టుక నుంచి మరణం వరకూ ఎన్నో ఏళ్ల పాటు అవిశ్రాంతంగా పనిచేసే అవయవాల శరీరం. మానవ శరీరం గురించిన కొన్ని ఆసక్తికరమైన, నమ్మలేని నిజాలివి.
మానవ శరీరంలో 1,00,000 మైళ్ల పొడవైన రక్త నాళాలు ఉంటాయి. చిన్న పిల్లల్లో అయితే, ఇవి 60 వేల మైళ్ల పొడవుంటాయి.
ఒక రోజులో మనిషి 50 వేల సార్లు ఊపిరి పీలుస్తాడు.
శరీరంలోని బలమైన కండరం దవడ కండరం.
శరీరం తనలోని ఒక శాతం నీటిని కోల్పోయినప్పుడు దప్పికగా అనిపిస్తుంది. 5 శాతం నీటిని కోల్పోతే విపరీతమైన అలసట, దాహం వేస్తాయి. 10 శాతం నీటిని కోల్పోతే డీ హైడ్రేషన్ తో ప్రాణం పోతుంది.
నిద్రలో వచ్చే కలల్లో 90 శాతం వరకూ మెలకువ రాగానే మరచిపోతుంటాం.
పురుషుల గుండెతో పోలిస్తే మహిళల గుండె వేగంగా కొట్టుకుంటుంది.
జన్మించక ముందే… అంటే కడుపులో ఉండగానే ఫింగర్ ప్రింట్స్ తయారైపోతాయి. గర్భంలో ఉన్న ఆరో నెలలో ఇవి ఏర్పడతాయి.
మానవ శరీరంలోని వృథా కణాల్లో ప్రతి నిమిషానికీ 30 కోట్ల కణాలు చనిపోతుంటాయి. వాటి స్థానంలో కొత్తవి వచ్చి చేరుతుంటాయి.
ఏదైనా శరీర అవయవానికి మెదడు సమాచారాన్ని ఇవ్వాల్సి వస్తే, అది గంటకు 268 మైళ్ల వేగంతో పయనిస్తుంది. మనిషి మెదడులో కొన్ని లక్షల కంప్యూటర్లలో దాచగలిగినంత మెమొరీని దాచవచ్చు. మెదడులో 2. పెటా బైట్ల (సుమారు పది లక్షల గిగాబైట్లు) సమాచారాన్ని దాచుకోవచ్చు.
శరీరంలో రక్తం సరఫరా కాని ఒకే ఒక్క భాగం కంటిలో ఉండే కార్నియా.
శరీరంలో డ్యామేజ్ అయితే, తనంతట తానుగా బాగు చేసుకోలేని అవయవం అంటూ ఏదైనా ఉందంటే అది దంతాలే.
తల వెంట్రుకలు సగటున నెలకు అర అంగుళం పెరుగుతాయి. వేసవి కాలంలో, నిద్రిస్తున్న వేళ జుట్టు పెరుగుతూ ఉంటుంది.
జీవితకాలం పాటు జుట్టును పెరగనిచ్చి, ఒక్కో వెంట్రుకనూ పేర్చుకుంటూ పోతే, 725 కిలోమీటర్ల మేర పరవవచ్చు. గోడ వైపు తిరిగి నిలబడి తలను గోడకు ఆనించడం ద్వారా 150 కేలరీల శక్తిని కోల్పోవచ్చు.
ఊపిరితిత్తులను పూర్తిగా విడదీస్తే, అది 50 నుంచి 75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పరచుకుంటుంది. ఇది దాదాపు ఓ టెన్నిస్ కోర్టు వైశాల్యంతో సమానం.
మానవ శరీరంలోని అతిపెద్ద కణం ఆడవారిలో అండం కాగా, అతి చిన్న కణం మగవారి వీర్య కణం.
వీర్య కణం పొడవు 50 మైక్రో మీటర్లు (సుమారు 0.05 మిల్లీ మీటర్లు) ఉండగా, అండం దానికన్నా 30 రెట్లు పెద్దదిగా కంటికి కనిపించేంతగా ఉంటుంది.













