ఇద్దరు చంద్రులను అన్ని రాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకోవాలి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులను కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి ప్రశంసించారు. ఢిల్లీలో జరిగిన నాలుగవ జల్మంథన్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. అంతరాష్ట్ర జలవివాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు కలిసి సామరస్యంగా పరిష్కరించుకున్నారు. వారిన్ని అన్ని రాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకోవాలి. వారిద్దరి రాజకీయ పరిణతి అభినందనీయం అని కితాబునిచ్చారు. జలవివాదాల పరిష్కారానికి ప్రభుత్వాల కంటే ప్రతిపక్షాలే ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. భవిష్యత్తులో జలవివాదాలను రాష్ట్ర ప్రభుత్వ నాయకలు నా దృష్టికి తీసుకొస్తే ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులతో కూడా మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పారు.








