సర్టిఫికెట్లలో తండ్రి పేరు ఐచ్ఛికమే!
డిగ్రీ సర్టిఫికెట్లలో తండ్రి పేరును జతచేయడం ఇకపై ఐచ్ఛికం కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పరిశీలనలో ఉంది. సర్టిఫికెట్లలో విద్యార్థి తండ్రి పేరును చేర్చడాన్ని ఐచ్ఛికం చేయాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి మంత్రి మేనకా గాంధీ ప్రతిపాదనకు కేంద్రమానవ వనరుల మంత్రిత్వ(హెచ్చార్డీ) శాఖ స్థూలంగా ఆమోదించింది. ‘ఈ సూచన బాగుంది. తల్లి పేరును చేర్చాలా? తండ్రి పేరును ఉంచాలా? అన్నది ఇకపై విద్యార్థి నిర్ణయానికే వదిలివేస్తున్నాం’ అని హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. దీనిపై యూజీసీ కసరత్తు చేస్తోందన్నారు.













