సూర్యునికి అవతల మరో ప్రపంచం
ఖగోళంలో సౌరకుటుంబానికి అవతల మరో ప్రపంచం ఉండేదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమికి కోట్ల సంవత్సరాల క్రితం ఓ పురాతన నక్షత్ర మండలంలో గ్రహాలను మింగేస్తున్న HIP 68468 అనే రాక్షస నక్షత్రాన్ని కనుగొన్నారు సైంటిస్టులు. ఆ పురాతన నక్షత్రమండలంలో కవలు గా రెండు గ్రహాలు ఉన్నట్టు వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఈ గ్రహాలకు HIP 68468b, HIP 68468c అనే పేర్లు పెట్టారు. కోట్ల యేళ్ల క్రితం ఈ నక్షత్రం చుట్టూ భూమి లాంటి గ్రహం పరిభ్రమించేదన్నారు. అయితే రాను రాను కక్ష్యలోని గ్రహాలను డార్క్ స్టార్ మింగేసి ఉంటుందని చిలీలోని లాసెల్లా అబ్జర్వేటరీకి చెందిన సైంటిస్టు జోర్గ్ మెలెండెజ్ వివరించారు.
కనుగొన్న రెండు గ్రహాలలో భూమిని పోలిన గ్రహం ఉందన్నారు జోర్గ్. ఆ పురాతన నక్షత్రం సేమ్ టు సేమ్ సూర్యునిలో ఉండే వేడి పదార్థమే ఉందన్నారు వీళ్లు. అలానే మన సూర్యుడు కూడా భూమితో సహా మిగతా గ్రహాలను మింగేస్తుందా అన్న ప్రశ్నలను కొట్టిపారేశారు సైంటిస్ట్ జోర్గ్.













