చట్టం అవసరం లేదు
ట్రిపుల్ తలాఖ్‌పై కొత్త చట్టాన్ని తేవలసిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా తేల్చి చెప్పింది. శతాబ్దాల ఈ తలాఖ్ వ్యవస్థను కొట్టివేసిన నేపత్యంలో మంగళవారం ఈ మేరకు సంకేతాలందించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పే చట్టమని వేరుగా మరో చట్టాన్ని తీసుకురావలసిన అవసరమే లేదన్నట్టుగా కేంద్రం తన వాదనకు పదును పెడుతోంది. గృహహింస సహా ప్రస్తుతం ఉన్న చట్టాలతోనే ఈ సమస్యను ఎదుర్కోవచ్చునని తేల్చిచెప్పింది. అయితే ఈ అంశాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేస్తామని ముఖ్యంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును లోతుగా పరిశీలించిన తరువాతే తాము తీసుకోవల్సిన చర్యలపై స్పష్టత వస్తుందని తెలిపింది.








