ముమ్మారు తలాక్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ట్రిపుల్ తలాక్‌కు ఒక్క తీర్పుతో సుప్రీం కోర్టు చెక్ పెట్టింది. పార్లమెంట్లో చట్టం చేసి బాధిత ముస్లిం మహిళలకు స్వాంతన చేకూర్చాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. చట్టం చేసేవరకు ట్రిపుల్ తలాక్‌పై ఎలాంటి పిర్యాదులు స్వీకరించబోమని తేల్చి చెప్పింది. ముస్లిం మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ట్రిపుల్ తలాక్‌పై కీలక అడుగు పడింది. ఈ అంశంలో ఐదురుగు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ట్రిపుల్ తలాక్ విషయంలో పార్లమెంట్లో చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ట్రిపుల్ తలాక్ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోబోదని తెలిపింది. ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసినందున ఆరు నెలల వరకు ట్రిపుల్ తలాక్ చెల్లుబాటు కాదు. ఈ ఆరు నెలల కాలం వరకు పిటిషన్లు కూడా విచారణకు స్వీకరించదు కాబట్టి ముస్లిం మహిళలకు ఊరట చేకూరే అవకాశం ఉంది.








