హైదరాబాద్ టూ సింగపూర్ విమాన టిక్కెట్ రూ.5,599కే
బడ్జెట్ ఎయిర్ లైన్స్ అయిన స్కూట్, టైగర్ ఎయిర్ బ్రాండ్లు ఏకమయ్యాయి. టైగర్ ఎయిర్ సర్వీసులు స్కూట్ పేరుతో మొదలయ్యాయని కంపెనీ వెల్లడించింది. విలీనాన్ని పురస్కరించుకుని ప్రమోషనల్లో భాగంగా హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు టికెట్ ధర రూ.5,599 నుంచి ఆఫర్ చేస్తున్నట్లు స్కూట్ ఇండియా హెడ్ భారత్ మహదేవన్ మీడియాకు తెలిపారు. హైదరాబాద్ నుంచి బాలి రూ.11,799, హాంకాంగ్ రూ.11,199, మెల్బోర్న్ రూ.12,499, సిడ్నీ టికెట్ ధర రూ.13,099ల నుంచి ఉందని తెలిపారు.








