నింగికెగసిన పీఎస్ఎల్వీ-సీ38.. జయహో ఇస్రో
నెల్లూరులోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ- సీ38 నింగికెగసింది.31ఉపగ్రహాలతో భారత కీర్తిపతాకను రెపరెపలాడిస్తూ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి వెళ్లింది.భూ పరిశీలన చేయనున్న ఈ ఉపగ్రహం సమగ్ర మ్యాపింగ్‌తో పాటు భూగర్భజలాల సమాచారం అందించనుంది.దీని బరువు 712 కేజీలు కాగా, మిగిలిన 30 నానో ఉపగ్రహాల బరువు కేవలం 243 కేజీలు.








