హైకోర్టును ఆశ్రయించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) తెలంగాణ హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు (Attapur police) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 23 నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి అసభ్యకరమైన సందేశాలు పంపుతూ లైంగికంగా వేధించడం ప్రారంభించాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వేరే వారితో వివాహేతర సంబంధం అంటగట్టి ప్రచారం చేయడం, బలవంతంగా మొబైల్ (Mobile) లాక్కొని వ్యక్తిగత మెసేజ్లు చూసి ఇబ్బందికి గురిచేశాడని ఆరోపించారు. వ్యక్తిగత వీడియోలు చిత్రీకరించి భర్తకు పంపి బెదిరింపులకు పాల్పడ్డాడని ట్రైనీ మహిళా ఐపీఎస్ పేర్కొన్నారు.








