22nd July 2026

__________

- Saidulu

ఏ అవుట్‌ఫిట్‌కైనా ఎక్సలెన్ట్ స్టైలింగ్ ఇచ్చే హ్యాండ్ కఫ్ బ్రేస్‌లెట్ కలెక్షన్స్!

హ్యాండ్‌కఫ్ బ్రేస్‌లెట్స్ నేటి ట్రెండీ ఫ్యాషన్. మీ పర్సనాలిటీ, సందర్భానికి తగ్గ లేటెస్ట్ డిజైన్ ఎంచుకుని చేతుల అందం రెట్టింపు చేసుకోండి!

పచ్చలు (Emeralds) మరియు మెరిసే రాళ్లతో కూడిన ఫ్లోరల్ మోటిఫ్స్, చేతి వేలి నుండి మణికట్టు వరకు ప్రత్యేకమైన ఎలిగెంట్‌ను ఇస్తాయి.

ఎమరాల్డ్ & ఫ్లోరల్ మోటిఫ్

బంగారు పూసల చైన్ మరియు స్క్వేర్ మోటిఫ్‌లో మెరిసే కెంపు రాళ్ళు సాంప్రదాయ పట్టు చీరలకు ఎంతో నిండుతనాన్ని, రాయల్ లుక్‌ను తెస్తాయి.

గోల్డ్ బీడ్స్ & రాయల్ స్క్వేర్

చేతికి సున్నితమైన చిరుగజ్జల హంగులతో రూపుదిద్దుకున్న ఈ డిజైన్, పండుగలు మరియు ఫ్యామిలీ ఈవెంట్లలో ఎంతో ప్రత్యేకంగా మెరుస్తుంది.

ఎత్నిక్ జుంకా స్టైల్

ఎరుపు రంగు లత ఆకృతులు మరియు డైమండ్ స్టోన్స్‌తో ఉన్న ఈ మోడరన్ ఫ్లోరల్ డిజైన్, కాక్‌టైల్ పార్టీలు, సంధ్య వేడుకలకు బెస్ట్ ఛాయిస్.

రూబీ ఫ్లోరల్ మోడరన్ లుక్

ఆకుల రూపాకారాలు, క్లాసీ గ్రీన్ రాయి కలయికతో వచ్చే ఈ వింటేజ్ శైలి బ్రేస్‌లెట్, చేతికి రాచరికమైన ఎలిగెంట్ లుక్ అందిస్తుంది.

వింటేజ్ ఫ్యూజన్ డిజైన్

చిన్న చిన్న ముత్యాల చైన్ కాంబినేషన్‌తో వచ్చే ఈ సింపుల్ డిజైన్, లైట్ వెయిట్ ప్రియులకు అలాగే ఆఫీస్/క్యాజువల్ వేర్‌కి అనుకూలం.

క్లాసిక్ పెర్ల్ ఎలిగెన్స్

గులాబీ రంగు రాళ్ళు మరియు కందన్ మెరుపులతో డిజైన్ చేసిన ఈ రాయల్ బ్రేస్‌లెట్, పెళ్లికూతురి డిజైనర్ లేహంగాలకు సూపర్ మ్యాచింగ్.

కుందన్ బ్రైడల్ కలెక్షన్

ఈ హ్యాండ్ కఫ్ బ్రేస్‌లెట్ ధరించినప్పుడు ఇతర గాజులు లేకుండా సింగిల్ స్టేట్‌మెంట్ పీస్‌గా వేస్తే మీ చేతుల అందం రెట్టింపు అవుతుంది!