పనుల్లో అలసత్వం వహిస్తే సహించను : సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ నియోజకవర్గం ( Kodangal constituency)లో తాను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎడ్యుకేషనల్ హబ్ (Educational hub)లోని వివిధ విద్యాసంస్థల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హకీంపేట ఎడ్యుకేషనల్ హబ్‌లో వివిధ విద్యా సంస్థల నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. ఈ పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ముందు అనుకున్న డెడ్‌లైన్ ప్రకారం 2027 మార్చి కల్లా హబ్‌లోని విద్యాసంస్థల నిర్మాణం పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకు తగిన విధంగా నెలవారీ లక్ష్యాలు నిర్ణయించుకొని పని చేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా పని చేయని వారెవరినైనా వెంటనే సస్పెండ్ (Suspended) చేయాలని ఉన్నతాధికారులకు చెప్పారు.పనులు నత్తనడకన సాగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీదట మరో లెక్క. అనుకున్న పని జరగకపోతే ఊరుకోను అన్నారు. కాగితాలపై నివేదికలు చూపిస్తే సరిపోదని, క్షేత్ర స్థాయిలో ఫలితాలు కనిపించాలని స్పష్టం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్లు తనకు తెలిసిన వారైనా పని చేయకపోతే ఫలితం అనుభవించక తప్పదని ముఖ్యమంత్రి హెచ్చరించారు.








