నాగార్జున సాగర్‌లో వరుణ యాగం : సీఎం రేవంత్ రెడ్డి
* రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయం
* వరుణ యాగానికి ముహూర్తంగా ఆగస్టు 10వ తేదీని నిర్ణయించిన యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిద్ధాంతి
* నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో యాగం నిర్వహణ
* దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు, నిర్ణయించిన ముహూర్తంలో యాగ క్రతువుల నిర్వహణ
* కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళ సంతరించుకోవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలన్న సంకల్పంతో ప్రత్యేక పూజలు
* రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో వరుణ యాగం
* యాగం అనంతరం మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి








