Telangana: వైద్యారోగ్యానికి రూ.13,679 కోట్లు.. మరి టిమ్స్ ఆసుపత్రులు తెరుచుకునేది ఎప్పుడంటే?
Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27లో భాగంగా వైద్యారోగ్య రంగానికి ఉప ముఖ్యమంత్రి , ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క భారీ నిధులను కేటాయించారు. ప్రజలకు నాణ్యమైన , అత్యాధునిక వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ఈ రంగానికి రూ.13,679 కోట్లు కేటాయిస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
బడ్జెట్ ప్రసంగం:
టిమ్స్ (TIMS) ప్రారంభం: హైదరాబాద్ నలుమూలల నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆసుపత్రులపై మంత్రి కీలక అప్డేట్ ఇచ్చారు. సనత్ నగర్, ఎల్బీ నగర్, , అల్వాల్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రులను 2026 చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
ఆసుపత్రుల విస్తరణ: నిమ్స్ (NIMS) ఆసుపత్రి విస్తరణ పనులతో పాటు, వరంగల్‌లో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. వీటి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 6,582 టెర్షియరీ కేర్ బెడ్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు.
వైద్య విద్యకు ఊతం: రాష్ట్రంలో ఇప్పటికే 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ స్కూళ్లు, 28 పారా మెడికల్ కాలేజీలను ప్రారంభించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. వీటితో పాటు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మరో 17 మెడికల్ కాలేజీలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ కేటాయింపులు ఆ దిశగా వేసిన బలమైన అడుగులని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి








