పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు (Congress MPs) ఆందోళనకు దిగారు. తెలంగాణ ఏర్పాటును భారత్ -పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య (Tejasvi Surya) లోక్ సభ లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించవద్దని ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)కి వ్యతిరేకంగా కూడా ఎంపీలు నినాదాలు చేశారు.
ఇవి కూడా చదవండి








