అవినీతిని నిర్మూలిస్తే .. వాటిని అమలు చేయవచ్చు : కవిత
అవినీతిని నిర్మూలిస్తే ప్రజలకు ఉచిత విద్య (Free education), వైద్యం వంటి పథకాలు అమలు చేయడం సాధ్యమేనని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha) అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో కవిత మాట్లాడుతూ ప్రపంచ మేధావులతో మాట్లాడి పాంచజన్య పేరుతో ఉచిత విద్య, వైద్యం (Medical), ఉపాది, వ్యవసాయం వంటి పథకాలతో ప్రజల ముందుకొచ్చాం. ఉచిత విద్య, వైద్యం సాధ్యం కాదని పలువురు నాయకులు విమర్శిస్తున్నారు. అవినీతిని నిర్మూలిస్తే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్తోనే వాటిని అమలు చేయవచ్చు. ఎల్నినో ప్రభావముంటుందని ఆర్నెల్ల కిందటే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదు. రాష్ట్రంలో 57 రిజర్వాయర్లలో 418 టీఎంసీల నీరు నిల్వ చేసే అవకాశమున్నా పట్టించుకోలేదు. ప్రస్తుతం కేవలం 93 టీఎంసీలు మాత్రమే ఉండడంతో సాగు, తాగునీటికి కష్టాలు తప్పేలా లేవు. సాగునీరు, ఉద్యోగాల కల్పన విషయంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) నాయకులు ఒకరిపై ఒకరు ఎదురుదాడి చేసుకుంటున్నారు. తప్పితే రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు అని పేర్కొన్నారు.








