గురుకుల విద్యార్థులే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు
గురుకుల విద్యార్థులే తెలంగాణకు భవిష్యత్ బ్రాండ్ అంబాసిడర్లు అని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Lakshman Kumar) తెలిపారు. గురుకులాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సంస్కరణలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మంది వైద్యులు, ఒలింపియన్లు, ఇంజినీర్లు ( Engineers), శాస్త్రవేత్తలు (Scientists), సివిల్ సర్వెంట్లు, గురుకులాల నుంచి రావాలని మంత్రి ఆకాంక్షించారు. ఎస్సీ గురుకుల సొసైటీలో నీట్లో అత్యుత్తతమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, తొలి ఆసియా అండర్ 23 అథైటిక్స్లో 4400 మీటర్ల రిలే పోటీలో స్వర్ణపతకం సాధించిన ప్రవళిక (Pravalika) మంత్రి అడ్లూరి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మెరుగైన ఫలితాలు ప్రతిభ చూపిన విద్యార్థులకు సీఎం ఈ సందర్భంగా అభినందించారు.








