నర్సులకు గుడ్ న్యూస్.. 3 లక్షల జీతంతో జర్మనీలో కొలువు!
Nursing Jobs : తెలంగాణ రాష్ట్రానికి చెందిన నర్సింగ్ అభ్యర్థులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హన్మకొండ కలెక్టరేట్ నుండి అందిన సమాచారం ప్రకారం, మొత్తం 90 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
అభ్యర్థులకు కనీస అనుభవం..
గుర్తింపు పొందిన కళాశాలల నుంచి GNM లేదా B.Sc నర్సింగ్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 22 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. GNM అభ్యర్థులకు కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. పాలియేటివ్ కేర్ (హోమ్‌కేర్, నర్సింగ్ హోమ్) లేదా ఇన్ పేషెంట్ విభాగాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
భాషపై ప్రత్యేక శిక్షణ..
ప్రాథమిక ఇంటర్వ్యూ సమయంలో జర్మన్ భాషా పరిజ్ఞానం అవసరం లేదు. ఎంపికైన వారికి భాషపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శిక్షణ మొదలైన ఆరు నెలల్లో A2 స్థాయిలో ప్రతిభ చూపిన వారిని కొనసాగిస్తారు. విమాన టికెట్ ఖర్చులతో సహా అన్ని ఖర్చులను సంస్థే భరిస్తుంది.
వేతనం..
గుర్తింపు పొందే వరకు నెలకు సుమారు రూ. 2.20 లక్షలు (2,300 యూరోలు), గుర్తింపు పొందిన తర్వాత నెలకు సుమారు రూ. 3 లక్షలు (2,800 యూరోలు) వేతనం ఉంటుంది. వీటితో పాటు ఓవర్ టైమ్ అలవెన్సులు కూడా ఉంటాయి.
దరఖాస్తు వివరాలు..
ఆసక్తి గల వారు germanytriplewin2025@gmail.com కు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తుకు చివరి తేదీ: 2026 ఏప్రిల్ 30.
- ఇంటర్వ్యూ తేదీలు: జూలై 8 నుంచి 17 వరకు.
- సంప్రదించాల్సిన నంబర్లు: 94400 51581, 94400 52081.








