మా ప్రభుత్వంలో ముదిరాజ్ లను భాగస్వాములను చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్రెడ్డి
పండగ సాయన్న జయంతి సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కొడంగల్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ముదిరాజులే
ముదిరాజులు విశ్వసనీయమైన వారు
భూస్వాములు తన భూమిని ఆక్రమించుకునప్పుడు పండుగ సాయన్న ఎదురుతిరిగారు
నిజాం హయాంలో దొరలు పేదలభూమి ఆక్రమిస్తుంటే పేదలకు అండగా పండగ సాయన్న నిలిచాడు
దొరలకు వ్యతిరేకంగా దళాన్ని ఏర్పాటు చేసినవాడు పండుగ సాయన్న
సాయన్న ప్రజలకు ధాన్యం పంచడమే కాదు, పేద ఆడ పిల్లల పెళ్లిళ్లకు ఆర్ధిక సాయం చేసిన ఘనత పండుగ సాయన్నది
సాయన్నను నిజాం పోలీసులు అరెస్టు చేస్తే నాటి వనపర్తి మహారాణి పెద్ద ఎత్తున నిధులు చెల్లించి సాయన్నను విడిపించారు
పండుగ సాయన్నను అన్యాయంగా హత్య చేశారు.. ఆయన చనిపోయి వందేళ్లు దాటినా నేటికీ నాట్లు, కోతల సమయంలో పండుగ సాయన్న పాటలు వినిపిస్తున్నాయి
బ్రిటిష్ హయాంలో కుల గణన చేశారు.. వందేళ్ల తర్వాత మా ప్రభుత్వం కుల గణన చేపట్టింది
కుల గణన చేసినందునే ఈ రోజు బలంగా ప్రతి కులం తమ గళం వినిపిస్తోంది
ఎవరైనా కుల గణనలో తమ జనాభా తక్కువగా ఉందని భావిస్తే పూర్తి వివరాలు ఇస్తే లెక్కలు సవరిస్తాం
లెక్కలు లేనందునే ముదిరాజ్ లను బీసీ డీ నుంచి బీసీ ఏ కు మార్చలేకపోయారు
ఈ అంశంపై వచ్చే క్యాబినెట్ లో చర్చిస్తాం
మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి, పూర్తి స్థాయిలో అధ్యయనం చేయిస్తాం
ఈ అంశంపై ఇతర కులాలకు ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాల్సి ఉంది
జఠిలమైన ఎస్సీ వర్గీకరణను అమలు చేశాం
బీసీ కుల గణన చేపట్టాం…
పీసీసీ అధ్యక్షుడిని కాగానే శ్రీహరి ముదిరాజ్ ను డీసీసీ ప్రెసిడెంట్ గా నియమించా
శ్రీహరి కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చా.. మంత్రిని చేశా
నీలం మధు కి ఎంపీ ఎంపీ టికెట్
ఇచ్చా
ముదిరాజ్ లకు ఎంఎల్సీ టికెట్ ఇచ్చే అంశాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు సూచిస్తున్నా
ప్రభుత్వంలో ముదిరాజ్ లను భాగస్వాములను చేసే బాధ్యత నాది
నాడు ఎన్టీఆర్ రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తే మనం సన్న బియ్యం ఇస్తున్నాం
3.48 కోట్ల మంది నేడు సన్న బియ్యం ఇస్తున్నాం
గత ప్రభుత్వాలు చేసిన సంక్షేమానికి రెట్టింపు చేస్తున్నాం
ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నాం.. ప్రతి ఊరిలో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నాం
తెలంగాణ వచ్చాక తెలంగాణ రాష్ట్ర గీతం అధికారికంగా ప్రకటించుకున్నాం
ఎన్టీఆర్, చంద్ర బాబు నాయుడు, వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ అమలు చేసిన మంచి పథకాలు అమలు చేస్తూనే… రెట్టింపు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్నల చరిత్రను కనుమరుగు చేశారు
ట్యాంక్ బండ్ పై పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్యల విగ్రహాలను ఆవిష్కరిస్తాం
పండుగ సాయన్న, గద్దర్, అందెశ్రీ వంటి వారు జీవితమంతా సమాజం కోసమే జీవించారు
బహుజనుల జీవితాలు బాగుపడాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి
వచ్చే ఎన్నికలు ఎంతో కీలకం.. ఆ ఎన్నికల్లో రాహుల్ కి అండగా నిలవాలి








