అనంతపురంలో రణబాలి గ్రాండ్ సక్సెస్ ఈవెంట్.. ఎప్పుడంటే?
టాలీవుడ్లో విజయ్ దేవరకొండ(vijay devarakonda), రష్మిక మందన్నా(Rashmika mandanna) జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి నటించిన రణబాలి(Ranabaali) సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. రియల్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్(Rahul Sankrithyan) రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్రమంగా పుంజుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో మూవీ సక్సెస్ ను ఫ్యాన్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
సినిమాకు లభిస్తున్న ఆదరణను పురస్కరించుకుని గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ ఈవెంట్ కు సంబంధించి టైమ్, ప్లేస్ ను మేకర్స్ అఫీషియల్ గా ఫిక్స్ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలోని హార్మోనీ సిటీలో ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. అక్టోబర్ 23న సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. తమ అభిమాన హీరో విజయ్ దేవరకొండను ప్రత్యక్షంగా చూసేందుకు, మూవీ సక్సెస్‌మీట్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటకు తోడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అజయ్(Ajay)- అతుల్(Atul) అందించిన మ్యూజిక్ కూడా సినిమాకి కీలకంగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మించిన ఈ సినిమా సక్సెస్ ఈవెంట్లో మేకర్స్ ఎలాంటి విశేషాలు పంచుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది.








