క్షమాపణలు చెప్పిన రణ్‌బీర్ కపూర్!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్(Ranbir kapoor) తాజాగా తన కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. కోల్‌కతాలో దసరా వేడుకల్లో పాల్గొన్న ఆయన నోరు జారడంతో సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ గురించి మాట్లాడుతున్న సమయంలో, ఆయన అనుకోకుండా సక్సెస్ అనే మీనింగ్ వచ్చే పదానికి బదులుగా అంతం అనే అర్థం వచ్చే పదాన్ని ఉపయోగించారు. దీంతో ఆయన స్పీచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యంగా రామాయణ(Ramayana)లో శ్రీరాముడి పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ పొరపాటుపై పలువురు నెటిజన్లు స్పందించారు.
ఈ వ్యవహారంపై తాజాగా రణ్‌బీర్ రెస్పాండ్ అయి క్లారిటీ ఇచ్చారు. చెన్నైలో తన నెక్ట్స్ మూవీ రామాయణ గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్‌తో పాటు ఫుల్ ఆల్బమ్ ను రిలీజ్ చేసిన సందర్భంగా జరిగిన ఈవెంట్లో ఆయన క్షమాపణలు తెలిపారు. దసరా వేడుకల్లో మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా మాట తడబడ్డానని, తన ఉద్దేశం మాత్రం చెడుపై మంచి, అసత్యంపై సత్యం ఎప్పటికైనా సక్సెస్ సాధిస్తాయనే మెసేజ్‌ను తెలియజేయడమేనని క్లారిటీ ఇచ్చారు.
డైరెక్టర్ నితేశ్ తివారీ(Nitesh tiwari) తెరకెక్కిస్తున్న రామాయణలో రణ్‌బీర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి(Sai pallavi) సీతగా, యష్(Yash) రావణుడిగా కనిపించనున్నారు. సన్నీ డియోల్(Sunny deol) హనుమంతుడిగా, రవి దూబే(Ravi dube) లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం నవంబర్ 5, 2026న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుండగా, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది.








