వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ఎంసి ఆర్ హెచ్ ఆర్ డి బోధి పెవిలియన్ లో
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష..
హాజరైన ఎంపీ వేం నరేందర్ రెడ్డి,సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్,ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ , సీఎం వో కార్యదర్శి మాణిక్ రాజ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జె. చోంగ్దు , మున్సిపల్ శాఖ సెక్రటరీ టి.కె శ్రీదేవి, వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి, హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ,ఇతర ఉన్నతాధికారులు
హాస్పిటల్ భవనం నిర్మాణం పైన పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి..
గ్రీన్ ఛానల్ లో నిధులు మంజూరు చేస్తున్నా ఎందుకు పనులు వేగం గా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం..
వచ్చే 30 రోజుల్లో 24 గంటల పాటు పని జరగాలి..
వర్క్ షెడ్యూల్ తయారు చేసుకొని ముందుకు వెళ్లాలి..
సిఎంఓ అధికారులు నిరంతరం గ్రౌండ్ కి వెళ్లి
సమీక్ష చేయాలి..
ప్రత్యేక అధికారులను నియమించి పనులను పర్యవేక్షణ చేయాలి..
ప్రతి పనికి ఒక ప్రత్యేక అధికారికి బాధ్యత అప్పగించాలి..
ఇక నుంచి ప్రతి రోజు కలెక్టర్ ఆస్పత్రి పనులను పర్యవేక్షించాలి..
శాఖల మధ్య సమన్వయం తో పని చేయాలి..
కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాలి..
త్వరలో ఓపి సేవలు అందుబాటులోకి తీసుకురావాలి..
హాస్పిటల్ చుట్టూ మంచి వాతావరణం ఉండేలా పరిసరాల్ని తీర్చి దిద్దాలి..
సనత్ నగర్ టిమ్స్ తరహా లో ఓపి సేవలు వరంగల్ లో అందుబాటులోకి తీసుకురావాలి ..
సనత్ నగర్ టిమ్స్ లో స్టాప్ క్వాటర్స్ ఏర్పాటు చేయాలి..
తక్షణమే స్టాప్ క్వాటర్స్ పనులు ప్రారంభం కావాలి..
హాస్పిటల్ మెయింటెన్స్ ను ఏజెన్సీ కి అప్పగించాలి..
వరంగల్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
భారీ నిధులతో నిర్మిస్తున్నందున పకడ్బందీగా పనులు చెయ్యాలి..
వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు పైన ప్రదానం గా దృష్టి పెట్టాలి ..
ఖమ్మం ,వరంగల్ ,కరీంనగర్ లను కలుపుతూ రోడ్ కనెక్టివిటీ ఏర్పాటు చెయ్యాలి..
వరంగల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం వరకు రోడ్ కనెక్టివిటీ డెవలప్మెంట్ కావాలి ..
హైదరాబాద్ తరహా లో వరంగల్ ను అభివృద్ధి చేయాలి
టెంపుల్,ఫారెస్ట్ టూరిజం పైన దృష్టి పెట్టాలి..
ఎయిర్పోర్ట్ ప్రారంభం అయ్యాక
భద్రకాళి దేవాలయం ,రామప్ప టెంపుల్ కి భక్తుల సంఖ్య పెరుగుతుంది..
టెంపుల్ కమిటీ ల పైన దృష్టి పెట్టాలి..
అన్ని సౌకర్యాల తో పెద్ద బస్ టెర్మినల్ కోసం ప్రణాళిక లు సిద్ధం చేయాలి..
వరంగల్ కు కాస్మోపాలిటన్ సిటీ గా మారే అవకాశాలు ఉన్నాయి..
ఆ దిశగా అధికారులు దృష్టి పెట్టి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి..
వరంగల్ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని అధికారులు పని చేయాలి..








