ఫోన్ పదే పదే వేడెక్కుతోందా? హీటింగ్ తగ్గించేందుకు ఈ టిప్స్ పాటించండి!
మన మన ఫోన్లు ఒక్కోసారి విపరీతంగా వేడెక్కిపోతాయి. ఈ రోజుల్లో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నవారే. మనం ఎక్కువగా ఫోన్ వాడకపోయినా… వేడెక్కిపోతోంది. దీనికి కేవలం మ్యానిఫ్యాక్చరింగ్ లోపాలు మాత్రమే కావు. మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా ఇందులో భాగమే. ఆ తప్పులు చేయకుండా వుంటే.. మన ఫోన్ వేడెక్కకుండావుంటుంది.
ఛార్జింగ్, ఎండలో వాడితే ఫోన్ హీటింగ్

మనం కవర్ తో సహా ఒక్కోసారి ఛార్జింగ్ పెట్టేస్తాం. దీంతో మొబైల్ బ్యాక్ కేస్ వేడిని బయటకు పోనివ్వకుండా అడ్డుకట్ట వేస్తుంది. దీని వల్ల ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్ త్వరగా వేడెక్కిపోతుంది. బ్యాక్ కేస్ తీసేసి, ఛార్జింగ్ పెడితే, బాగుంటుందని అంటారు.
అలాగే ఈ మధ్య బైక్ నడుపుతూ కూడా మొబైల్ వాడటం చాలా కామన్ అయిపోయింది. బైక్ నడుపుతున్నప్పుడు మొబైల్ హోల్డర్ లో పెట్టి ఎండలో వాడటం, లేదా కారు డాష్ బోర్డు పైన పెట్టడం వల్ల ఫోన్ తీవ్రంగా హీట్ ఎక్కిపోతుంది. ఎండ లేదా వేడి ప్రదేశాలలో వాడటం వల్ల కూడా ఇది రిపీట్ గా ప్రాబ్లమ్ వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి
ఛార్జింగ్ సమయంలో ఫోన్ వాడటం తగ్గించండి

అంతేకాకుండా మన మన అవసరాలు ఫోన్లలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫోన్ లేకుండా వుండలేకపోతున్నాం. అయితే.. ఛార్జింగ్ పెట్టేసి, దానిని వదిలేయాలి. అలా కాకుండా కొందరు ఛార్జింగ్ పెట్టేసి ఆటలాడటం, మాట్లాడటం చేస్తుంటారు. దీని వల్ల హెవీ లోడింగ్ అవుతుంది. ఓ వైపు బ్యాటరీ నిండుతుంటుంది., మరో వైపు ప్రాసెసర్ క్లిష్టమైన పనులు చేయడం వల్ల ఫోన్ వేడెక్కుతుంది. పేలే ప్రమాదం కూడా వుంది.
ఫోన్ హీటింగ్ తగ్గించే జాగ్రత్తలు

అంతేకాకుండా కంపెనీ ఛార్జర్ కాకుండా ఒక్కోసారి మనం నకిలీ, తక్కువ రేట్లకు దొరికిన ఛార్జింగ్ లతో మన మన మొబైల్స్ ను ఛార్జింగ్ చేస్తుంటారు. దీని వల్ల లోకల్ ఛార్జర్లు, కేబుల్ వాడకం వల్ల వోల్టేజీల్లో తేడాలు వచ్చేస్తాయి. దీంతో ఫోన్ కూడా వేడెక్కుతుంది. బ్లూటూత్, వైఫై, జీపీఎస్ (Location) వంటి ఫీచర్లను అవసరం లేకపోయినా ఆన్‌లో ఉంచడం, మరియు బ్యాక్‌గ్రౌండ్‌లో పదుల సంఖ్యలో యాప్స్ రన్ అవ్వడం వల్ల ప్రాసెసర్‌పై భారం పడుతుంది.
అందుకే ఫోన్ వేడెక్కకుండా వుండాలంటే మొబైల్ బ్యాక్ కవర్ తీసి పక్కన పెట్టాలి. బెడ్ లేదా దిండు కింద ఫోన్ పెట్టి ఛార్జింగ్ చేయవద్దు. గాలి ఆడేలా వుండాలి. మీ ఫోన్ సాఫ్ట్వేర్ మరియు యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. పాత వెర్షన్లలో ఉండే బగ్స్ వల్ల కూడా ఫోన్ హీట్ అవ్వచ్చు.








